భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు ప్రస్తుతం పునర్నిర్మాణం, పునరావాసం పనుల్లో తలమునకలై ఉన్నాయి. ప్రభుత్వాలకు కాస్త చేయూత అందించేందుకు టాలీవుడ్ ప్రముఖులు చాలామంది విరాళాలు ప్రకటించారు.
అయితే తమిళ పరిశ్రమ నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి విరాళాలు రాలేదు. తమ సినిమాల్ని డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి, డబ్బులు సంపాదించుకునే హీరోలు.. మానవతా దృక్పథంతో వ్యవహరించడం మరిచిపోయారంటూ చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఎట్టకేలకు కోలీవుడ్ నుంచి శింబు స్పందించాడు.
తెలుగు రాష్ట్రాలకు తనవంతు సహాయంగా 6 లక్షల విరాళం ప్రకటించాడు. దీంతో తెలుగు ఆడియన్స్ అంతా శింబును ఒకే ఒక్కడు అంటూ మెచ్చుకుంటున్నారు. కోలీవుడ్ నుంచి ప్రస్తుతానికి విరాళం అందించిన ఒకే ఒక్క హీరో శింబు. ఇతడ్ని చూసి మిగతా హీరోల్లో చలనం వస్తుందేమో చూడాలి.
అయితే శింబు ఇలా వ్యవహరించడం వెనక కూడా ఓ కారణం ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాలో ఓ పాట పాడాడు శింబు. ఆ పాట కోసం అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. అయితే అతడిపై గౌరవంతో నిర్మాతలు కొంత మొత్తాన్ని అతడికి ఇచ్చారంట.
పవన్ ఐడియాలజీని ఇష్టపడే శింబు, వెంటనే ఆ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజంగా ఇది గొప్ప విషయమే.
శింబు, శింబు విరాళం,