
దర్శకుడు క్రిష్ తాజా స్టేట్ మెంట్ ఇది. పవన్ కల్యాణ్ తో కచ్చితంగా మరో సినిమా చేస్తానంటున్నాడు ఈ డైరక్టర్. దీనికి కారణం అందరికీ తెలిసిందే.
‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ తో మొదలుపెట్టాడు క్రిష్. కానీ సినిమా ఆలస్యమౌతుండడంతో, తప్పుకున్నాడు. అనుష్కతో ‘ఘాటీ’ సినిమా సెట్స్ పైకి వెళ్లాడు. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ను జ్యోతికృష్ణ హ్యాండిల్ చేశాడు. సినిమాను ముగించాడు, రిలీజ్ చేశాడు.
అయితే పవన్-క్రిష్ మధ్య అభిప్రాయబేధాలున్నాయని, వాళ్లిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని కొంతమంది గాసిప్స్ అల్లారు. వీటిని పవన్ బహిరంగంగా తిప్పికొట్టారు. నిండు సభలో క్రిష్ ను మెచ్చుకున్నారు, అతడికి థ్యాంక్స్ కూడా చెప్పారు.
క్రిష్ కూడా పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, అవకాశం వస్తే పవన్ తో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ‘ఘాటీ’ పనుల్లో బిజీ.















