
నారా రోహిత్ కెరీర్ లో చాలా లేట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘సుందరకాండ’ మాత్రమే. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా, ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
నిజానికి ‘ప్రతినిధి-2’ తర్వాత, ‘భైరవం’ కంటే ముందు ‘సుందరకాండ’ సినిమానే షెడ్యూల్ అయింది. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాకు తాజాగా మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు.
ఆగస్ట్ 27న ‘సుందరకాండ’ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నారా రోహిత్, సీనియర్ నరేష్, అభినవ్ గోమటం కాంబినేషన్ లో విడుదల చేసిన వీడియో బాగుంది.
మొత్తానికి నారా రోహిత్ చవితి హాలిడేస్ పై కర్చీఫ్ వేశాడు. ఫ్యామిలీ ఎఁటర్ టైనర్ గా తెరకెక్కిన ‘సుందరకాండ’ సినిమాలో వ్రితి వాఘని హీరోయిన్ గా నటించగా.. ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకుడు.















