
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. నటి, యాంకర్ అనసూయ ఇప్పటివరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసిందంట. అన్ని సోషల్ మీడియా పేజీల్లో కలుపుకుంటే, తను బ్లాక్ చేసిన వారి సంఖ్య ఇంత ఉంటుందని ఆమె చెబుతోంది.
అనసూయపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. ఆమె చేసి వ్యాఖ్యలు కావొచ్చు, పెట్టే ఫొటోలు కావచ్చు, హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అందులో కొన్ని వివాదాస్పదమౌతుంటాయి.
ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా కనిపించే హ్యాండిల్స్ ను ఆమె ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తుంటుంది. నిజానికి ఆమెపై ట్రోలింగ్స్, వ్యతిరేకత ప్రారంభంలో కాస్త తక్కువగానే ఉండేది.
ఎప్పుడైతే ఆమె విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసిందో, అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఆమె హేటర్స్ బ్యాచ్ పెరిగింది. వెల్లువలా వచ్చిన నెగెటివిటీని అనసూయ సమర్థంగా ఎదుర్కొంది. చాలా పోస్టులకు సమాధానమిస్తూ, ఓపిగ్గా ఎదురుచూసింది. కొన్నింటిని మాత్రం బ్లాక్ చేసింది. అలా ఇప్పటివరకు ఓ 30 లక్షల ఎకౌంట్లను బ్లాక్ చేసి ఉంటానని ఆమె వెల్లడించింది.

ఇన్ని జరిగినా ఆమె తన గ్లామర్ ఫోటోషూట్లు తగ్గించడం లేదు. అందాల ప్రదర్శన అనేది నా ఇష్టం అని చెప్తోంది. ఈ విషయంలో తనని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని ఖరాకండీగా చెప్తోంది అనసూయ.















