
“ధీరోదాత్త” కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోని కంగన చూసింది. ఇప్పుడు ఆమె దానికి స్పందించింది.
ఆ మీమ్ పేజ్ కి ఆమె రెస్పాండ్ అవుతూ దండం ఇమేజి పెట్టింది. అంటే ఆమె ఆనందాన్ని అలా వ్యక్తపరిచింది.
కంగన తెలుగులో “ఏక్ నిరంజన్” వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో అవకాశం వస్తే ఈ భామ ఆనందంగా ఒప్పుకునేలా ఉంది. ప్రస్తుతం ఇద్దరూ ఒకే రాజకీయ గ్రూప్ లో ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షం. ఇక కంగన బీజేపీ ఎంపీగా కొనసాగుతోంది. ఇద్దరూ హిందూ ధర్మం గురించి ప్రకటనలు ఇస్తారు. సో, వీరికి లైక్ మైండెడ్ నెస్ ఉంది. మరి ఇద్దరూ కలిసి నటిస్తే అదిరిపోతుంది అని చెప్పొచ్చు.
ఐతే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఒకటే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఆమెకి ఛాన్స్ లేదు. బహుశా ఆ తర్వాత చేసే సినిమాల్లో కంగనకి పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.















