
“మున్నీటి గీతలు” పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి తానా బహుమతి కూడా లభించింది. ఆ నవల నచ్చి దర్శకుడు క్రిష్ చింతకింది శ్రీనివాసరావు రాసిన నవల హక్కులను కొన్నారు. ఆయన్ని తన రైటింగ్ టీంలో ఒక మెంబర్ గా తీసుకున్నారు.
ఆ నవల కథ ఏంటో తెలుసా?
శ్రీకాకుళం నుంచి కొందరు జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తారు. గుజరాత్ లోని ఒక సేఠ్ చెప్పినట్లుగా వాళ్ళు చేపలను సముద్రం లోపలికి వెళ్లి భారతీయ హద్దులు దాటి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి అడుగుపెడతారు. దాంతో పాకిస్తాన్ వారిని బంధించి జైల్లో పెడుతుంది. వారిని విడిపించేందుకు జరిగే ప్రయత్నమే ఈ “మున్నీటి గీతలు.”
ఈ కథ చదివుతుంటే మొన్నే ఓ సినిమా చూసినట్లు అనిపిస్తుంది కదూ. అవును… గీతా ఆర్ట్స్ సంస్థ నాగ చైతన్య హీరోగా “తండేల్” అనే పేరుతో సినిమా తీసింది. కథ ఒక్కటే. హీరోయిన్ పాయింట్ , లవ్ స్టోరీ మాత్రం డిఫెరెంట్. అలా ఈ నవల నుంచి పాయింట్ కాపీ కొట్టి తీసి సినిమాని విడుదల చేశారు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాసు.
పాపం, క్రిష్ ఈ నవల హక్కులు పొంది వెబ్ డ్రామాగా తీశారు. సత్యదేవ్, ఆనందిని జంటగా ఈ వెబ్ డ్రామా రూపొందింది. “అరేబియా కడలి” పేరుతో వెబ్ సిరీస్ ని నిర్మించారు క్రిష్. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ వెబ్ సిరీస్ వచ్చినా ఆల్రెడీ తండేల్ ఛాయలున్నాయని జనం అనుకుంటారు అసలు విషయం తెలియక. పాపం అలా క్రిష్ గీతా ఆర్ట్స్ వల్ల దెబ్బతిన్నాడు.















