
లెక్కప్రకారం ఈపాటికి ‘ప్యారడైజ్’ (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా. కానీ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. హీరో నాని కావాలని తీసుకున్న నిర్ణయం ఇది.
సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేనప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా (Kingdom) విడుదలకు సిద్ధమైంది. ఇలాంటి టైమ్ లో ‘ప్యారడైజ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మరోసారి సోషల్ మీడియాలో రగడ మొదలవుతుందని నాని అనుమానించాడు. అందుకే లేనిపోని వివాదాలు సృష్టించకూడదనే ఉద్దేశంతో తన సినిమా ఫస్ట్ లుక్ విడుదలను వాయిదా వేసుకున్నాడు.
అటు విజయ్ కూడా వివాదాల్ని తగ్గించే క్రమంలో తన సినిమా ప్రీమియర్స్ ను తెలుగు రాష్ట్రాల్లో వేయడం లేదు. ప్రస్తుతానికైతే ‘ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ రిలీజయ్యే అవకాశం ఉంది.















