ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో విడాకుల వ్యవహారాలు చాలా తక్కువ. అప్పట్లో బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రసీమల్లో కూడా కామన్ అయింది. తెలుగులో నాగ చైతన్య – సమంత, నిహారిక – చైతన్య జొన్నలగడ్డ వంటి విడాకుల వ్యవహారాలు ఆ మధ్య బాగా వార్తల్లో నిలిచాయి.
గత రెండుళ్లుగా ఈ ట్రెండ్ కోలీవుడ్ లో ఎక్కువగా కొనసాగుతోంది. హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చారు. హీరో విష్ణు విశాల్ కూడా భార్యకి విడాకులు ఇచ్చి జ్వాలా గుత్తాని పెళ్లాడాడు.
అంతకుముందు హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్ విడిపోయారు. ఆ తర్వాత జీవి ప్రకాష్ కుమార్ తన భార్యకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సంగీత దర్శకుడు ఇమ్మాన్ కూడా భార్యకు దూరమయ్యారు. ఇప్పుడు జయం రవి 15 ఏళ్ల కాపురం తర్వాత భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
పాతకాలపు నిర్మాత కూతురు ఆర్తి. ఆమెతో జయం రవి పెళ్లి 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. జయం రవి, ఆర్తిలది ఆదర్శదాంపత్యం అన్న పేరు కూడా వచ్చింది. ఐతే, నెల రోజుల క్రితమే మాత్రం వీరి కాపురం గురించి పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆర్తి తన ఇన్ స్టాగ్రామ్ నుంచి జయం రవి ఫోటోలను అన్నిటిని తొలగించింది. తాజాగా విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించారు.
ALSO READ: Actor Jayam Ravi announces separation from his wife
సంప్రదాయాలకు నెలవైన మద్రాస్ నగరంలో ఉన్న చిత్రసీమలో ఇటీవల విడాకులు, ఎఫైర్ల గోల ఎక్కువైంది. బయటికి వచ్చినవి కొన్నే, బయటకు రాకుండా, విడిపోయి విడిపోకుండా కలిసి ఉన్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు కూడా ఉన్నారు.