‘కస్టడీ’ సినిమా ఫ్లాప్ అయింది. ‘మనమే’ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు సినిమాలు లైన్లో ఉంటుండగానే.. తమిళం, మలయాళం వైపు షిఫ్ట్ అయింది కృతిషెట్టి. దీంతో టాలీవుడ్ కు ఆమెకు మధ్య గ్యాప్ వచ్చేసింది. పైగా ‘మనమే’ సినిమా ఫ్లాప్ తో కృతి శెట్టి టాలీవుడ్ కెరీర్ కు చిన్న బ్రేక్ పడింది. ప్రస్తుతం కృతి చేతిలో మరో తెలుగు సినిమా లేదు. అయినప్పటికీ ఆమె తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
ఆమె నటించిన మలయాళ చిత్రం ‘ఏఆర్ఎమ్’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమె మల్లూవుడ్ కు పరిచయమౌతోంది. ఇప్పుడీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మరోసారి పలకరించబోతోంది కృతి.
“ఇదొక మలయాళం సినిమా. తెలుగులో చాలా బాగా డబ్ చేశాం. నేనే డబ్బింగ్ చెప్పాను. కొచ్చి, ముంబయి, బెంగళూరులో ప్రచారం చేసి హైదరాబాద్ కు వస్తే సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది.”
ALSO CHECK: Krithi Shetty’s Ganesh festival 2024 look
ఈనెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులో అవకాశాలొస్తాయని ఆమె భావిస్తోంది. అందుకే ప్రేక్షకులంతా తన సినిమాపై ప్రేమ కురిపించాలని కోరుతోంది. ఇది కాకుండా ఆమె చేతిలో 3 తమిళ సినిమాలున్నాయి.