‘మిస్టర్ బచ్చన్’ సెట్స్ పై ఉంటుండగానే మరో ఆఫర్ అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ సినిమాలో ఆమె నటిస్తోంది. ఎప్పుడైతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ అయిందో, ఈమె పనైపోయిందని అంతా అనుకున్నారు.
కానీ సినిమా ఫ్లాప్ అయినా, భాగ్యశ్రీ అందాలు క్లిక్ అయ్యాయి. ఆమెకు అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగా దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశం అందుకుంది. తాజాగా జరిగిన సినిమా పూజా కార్యక్రమం జరిగింది. “కాంత” అనే ఈ సినిమాలో ఆమె దుల్కర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
మోడలింగ్ లో రాణించిన ఈ ముంబయి భామ, “యారియాన్-2” అనే హిందీ సినిమాతో నటిగా మారింది. తాజాగా “చందు ఛాంపియన్” సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆమె లుక్స్ నచ్చి “మిస్టర్ బచ్చన్”లో మెయిన్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు దర్శకుడు హరీశ్ శంకర్.
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీని అత్యంత అందంగా చూపించాడు. ఒక దశలో రవితేజ కంటే ఎక్కువగా భాగ్యశ్రీకే స్క్రీన్ స్పేస్ దక్కిందంటే, ఈ అమ్మాయిపై హరీశ్ శంకర్ ఎంతలా ఫోకస్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. అలా హరీశ్ చేసిన కృషితో, టాలీవుడ్ లో భాగ్యశ్రీ ఇప్పుడిప్పుడే అవకాశాల వేటలో పడింది.