ఒకప్పుడు హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉండేదో, వాళ్లతో సమానంగా శృంగార పాత్రలకు కూడా అంతే క్రేజ్ ఉండేది. అయితే రానురాను సినిమాల్లో ఈ తరహా పాత్రలు తగ్గిపోయాయి. ఇప్పుడు హీరోయిన్ల పాత్రలు లేదా ఐటెం సాంగ్ లే. సినిమాలో ఒక కీలక పాత్ర పోషించే ‘శృంగార తార’ తరహా పాత్రలు దాదాపుగా కనుమరుగు అయ్యాయి.
ఐతే ఇటీవల అనసూయను ఆ కోణంలో చూస్తున్నారు కొంతమంది. సినిమాల్లో ఈ తరహా హాట్ రోల్స్ కు అనసూయ సరిగ్గా సూట్ అవుతుంది. ఆమధ్య వచ్చిన “విమానం” సినిమాలో ఆమె పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అందర్నీ ఆకట్టుకుంది.
ఇలాంటి హాట్ పాత్రలు, శృంగార తార పాత్రలకు అనసూయ సరిగ్గా సూట్ అవుతుందనే చర్చ ఉంది కానీ అనసూయ ఆలోచనలు మాత్రం ఇలా లేవు. ఏదో ఒక ఇమేజ్ కు పరిమితమైపోవడం ఆమెకు ఇష్టం లేదు.
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో విలనిజం కూడిన మహిళగా మెప్పించింది. ఈ రెండూ వేటికవే భిన్నం. అలా వైవిధ్యమైన రోల్స్ చెయ్యాలని భావిస్తోంది.
బుల్లితెరపై హాట్ గా కనిపిస్తూ యాంకరింగ్ చేయడంలో పెద్దగా కొత్తదనం ఉండదు. అదే వెండితెరపై అయితే ఎన్నో రకాల పాత్రలు పోషించొచ్చు. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ ఆ దిశగానే సాగుతోంది. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఓన్లీ గ్లామర్ ఇమేజ్ కానీ, లేడి విలన్ ఇమేజ్ కానీ కోరుకోవడం లేదు. అన్ని రకాల రోల్స్, అన్నీ ఇమేజ్ లు కావాలి అని భావిస్తోంది అనసూయ.