నందమూరి వంశానికి హార్డ్ కోర్ ఫ్యాన్ వైవీఎస్ చౌదరి. హరికృష్ణకు సీతయ్య రూపంలో అదిరిపోయే హిట్టిచ్చాడాయన. హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేశాడు. ఇప్పుడు హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై ఆయన భార్య యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ పాటలు, సాయి మాధవ్ బుర్రా మాటలు రాయనున్నారు. అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వైవీఎస్అనౌన్స్ చేశారు.
అయితే నందమూరి కుటుంబంలో ఆర్డర్ ప్రకారం చూస్తే వైవీఎస్ జూనియర్ ఎన్టీఆర్ ని మిస్సయ్యాడు. ఆర్డర్ ప్రకారం చూసుకుంటే.. హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ వైవీఎస్ చేయలేదు. దీనికి ఆయన తన లాజిక్ చెబుతున్నాడు.
“నేనే కథ రాసుకొని, నేనే సినిమా తీసే ప్రాసెస్ లో చాలామంది హీరోల వద్దకు వెళ్లే అవకాశాలు తక్కువ. రెగ్యులర్ గా సినిమాలు చేస్తేనే అందరి దగ్గరకు వెళ్లాలి. లాహిరి లాహిరి సినిమా చేసిన తర్వాత మళ్లీ హరికృష్ణ గారితోనే సీతయ్య చేశాను. పెద్ద హీరోల దగ్గరకు వెళ్లి కథ చెప్పి సినిమా తీయాలనే ఆలోచన నా బ్రెయిన్ కు రాలేదు. స్టార్ డమ్ చూడను, నేను కథ రాసుకున్న తర్వాత ఆ కథకు, నాకు కన్వీనియంట్ గా ఎవరు అనిపిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లిపోతాను. తారక్ దగ్గరకు వెళ్లాలనే ఆలోచన పుట్టించే కథ నాకు రాలేదు. అలాంటి కథ వస్తే కచ్చితంగా తారక్ దగ్గరకు వెళ్తాను.”
పెద్ద ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదని.. మనవళ్లంతా ఆయనకు సమానమేనని అన్నారు. అదే విధంగా నందమూరి అభిమానులందరికీ ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అందరూ సమానమేనని అంటున్నారు వైవీఎస్.
వైవీఎస్, వైవీఎస్ చౌదరి, ఎన్టీఆర్,