మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) చప్పగా సాగింది. ఈ బర్త్ డేకి రాజమౌళి సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ గట్టిగా ఎదురుచూశారు. కనీసం సినిమా ప్రకటన అయినా వెలువడుతుందనుకున్నారు. కొందరు ఓ కాన్సెప్ట్ పోస్టర్ వస్తుందని ఆశపడ్డారు. కానీ అలాంటివేం జరగలేదు.
మహేష్ బాబు అభిమానులు బాగా నిరాశచెందారు. ఈ పుట్టినరోజు టైమ్ కు మహేష్ సెట్స్ పై లేడు, అలా అని కొత్త సినిమా విశేషాలు కూడా అందించలేదు. మహేష్ కు ఇలాంటి సందర్భాలు కొత్త కాదు.
మహేష్ బాబు, రాజమౌళి సినిమా భారీ ఎత్తున రూపొందనుంది. ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ కి పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ దర్శకుడిగా ఎదిగారు. ఆయన సినిమాలపై హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఒక హాలీవుడ్ స్టూడియోతో రాజమౌళి చేతులు కలిపే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
మహేష్ బాబుతో తీసే సినిమాకి ఈ హాలీవుడ్ స్టూడియో పార్ట్నర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందుకే, రాజమౌళి ఈ సినిమా ప్రకటన విషయంలో ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం.