‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో వితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ నేపధ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో ఈ సినిమా విశేషాలని పంచుకున్నారు.
మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రిత్యా లాగోస్ (నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మ్యానెజ్మెంట్ కోసం ముంబై వచ్చాను. అప్పుడే మోడలింగ్ చేశాను. కొన్ని యాడ్స్ లో నటించాను. ఆ టైంలో ‘మిస్టర్ బచ్చన్’ అవకాశం వచ్చింది. హైదరాబద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ మేకర్స్ కి నచ్చింది.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తెలుగు మార్వాడి గర్ల్. బచ్చన్ లైఫ్ లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
ఇదే మొదటి చిత్రమా? ఏవైనా సినిమాలు చేశారా?
బాలీవుడ్ మూవీ ‘చందూ చాంపియన్’ లో చిన్న క్యామియో తప్పితే మరే సినిమాలు చేయలేదు.
తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పారు?
నా వాయిస్ ఐతే ప్రేక్షకులు మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్ గారిని కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కష్టంగా అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం చాలా సపోర్ట్ చేసింది. వారం రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేశాను.
హరీష్ శంకర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
హరీష్ గారు చాలా పాషనేట్ డైరెక్టర్. హరీష్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్ పీరియన్స్. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశా.
రవితేజ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
రవితేజ గారు సెట్ లో టైంకి వస్తారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్ గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్ వున్నా మన క్రాఫ్ట్ కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను.
మీ డ్యాన్స్ కి ఈ రెస్పాన్స్ ఊహించారా?
నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఖాళీ టైంలో డ్యాన్స్ చేస్తుంటాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా చేశాను కదా. నా డ్యాన్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. కల నిజం కావడం అంటే ఇదే.
మిమ్మల్ని నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు?
అది నిజం అయితే బాగుండు. కానీ వినడానికి బాగుంది. కాంప్లిమెంట్ గా భావిస్తాను.
కొత్త సినిమాలు?
కొన్ని ఒప్పుకున్నాను. మేకర్స్ ప్రకటిస్తే బాగుంటుంది.