సంక్రాంతి పండగ టైంలో సినిమా విడుదల చెయ్యాలని ప్రతి పెద్ద హీరో అనుకుంటారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసేవారు. కానీ ఇటీవల అది కుదరడం లేదు. 2016 తర్వాత మళ్ళీ ఏ సంక్రాంతికి తన సినిమాని తీసుకురాలేదు. అందుకే 2026లో కర్చీఫ్ వేశారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ పాన్ ఇండియా మూవీని తీయనున్నారు. ‘కెజియఫ్’, ‘సలార్’ చిత్రాల తర్వాత నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అతని కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పలువురు సినీ ప్రములు హాజరయ్యారు. జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సుకుమార్ డైరెక్ట్ చేసిన “నాన్నకు ప్రేమతో” చిత్రం 2016 సంక్రాంతికి విడుదలైంది. ఇప్పుడు 2026 సంక్రాంతికి ఈ మూవీ రానుంది. అంటే పదేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులకు సంక్రాంతి క్రాంతి రానుంది.
ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు కానీ “డ్రాగన్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి దీన్ని “ఎన్టీఆర్ నీల్” ప్రాజెక్ట్ గా పరిగణిస్తున్నారు.