చూస్తుంటే, ఓ మోస్తరు క్రేజ్ తో వస్తున్న సినిమాలన్నీ భారీగానే వస్తున్నట్టున్నాయి. “అర్జున్ రెడ్డి” నుంచి తాజాగా వచ్చిన “భారతీయుడు-2” వరకు చాలా సినిమాలు పెద్ద నిడివితో వస్తున్నాయి. కంటెంట్ బాగున్నప్పుడు కట్ చేయడం ఎందుకనే భావనలో మేకర్స్ ఉన్నారు.
ఇప్పుడీ లిస్ట్ లోకి “డబుల్ ఇస్మార్ట్” కూడా చేరిపోయింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా A-సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా రన్ టైమ్ అక్షరాలా 2 గంటల 42 నిమిషాలు. ఓ కమర్షియల్ సినిమాకు ఇంత లెంగ్త్ అవసరమా అనే చర్చ ఓవైపు నడుస్తుంటే, అసలు పూరి జగన్నాధ్ సినిమాలు ఇంత లెంగ్త్ లో రావడమే విశేషం అనే డిస్కషన్ కూడా ఉంది.
ఫక్తు కమర్షియల్ సినిమాల్ని పెర్ ఫెక్ట్ లెంగ్త్ లో కట్ చేస్తారు. రెడున్నర గంటలు దాటదు బొమ్మ. అవసరమైతే మరో 5-10 నిమిషాలు తగ్గించడానికి చూస్తారు. ఇక పూరి జగన్నాధ్ విషయానికొస్తే, లెంగ్త్ విషయంలో ఈ దర్శకుడు చాలా పర్టిక్యులర్. ఈయన దృష్టిలో రెండున్నర గంటలు కూడా చాలా ఎక్కువ.
“డబుల్ ఇస్మార్ట్ “ఫైనల్ కట్ విషయంలో మనసు మార్చుకున్నాడు పూరి జగన్నాధ్. పూరి కెరీర్ లోనే భారీ నిడివి సినిమాగా వస్తున్న “డబుల్ ఇస్మార్ట్” ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.