హీరో రాజ్ తరుణ్ కు అతిపెద్ద ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా అతడికి ముందస్తు బెయిల్ దొరికింది. ఈరోజు తెలంగాణ హైకోర్టు రాజ్ తరుణ్ కు అనుకూలంగా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పట్లో రాజ్ తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేయలేరు.
హీరో రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్ల సహజీవనం చేశాడని, ఆ తర్వాత గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడని, కాపురం చేసి కడుపు చేసి, తర్వాత అబార్షన్ చేయించాడంటూ లావణ్య అనే మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, రాజ్ తరుణ్ ను విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు. అప్పట్లో రాజ్ తరుణ్ తన తరఫున లాయర్ ను పంపించాడు. ఆ వెంటనే, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
రాజ్ తరుణ్ తో పెళ్లి జరిగినట్టు ఆధారాలు చూపించాలంటూ నేరుగా కోర్టు ప్రశ్నించింది. కనీసం శుభలేఖ అయినా చూపించాలంటూ అడిగింది. దీనిపై లావణ్య తరఫు లాయర్ సమాధానం ఇవ్వలేకపోయారు. సాక్ష్యాల కోసం సమయం కావాలని అడిగారు. ఈ వాదనతో ఏకీభవించని కోర్టు, రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.