ఈరోజు నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. 2 ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోతో పాటు, గతంలో నాగచైతన్య-సమంత ఇష్యూపై కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు ఆమె స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కొన్ని పోస్టులు పెట్టాడు. పేరు చెప్పకుండా.. ఓ మహిళకు అతడు కంగ్రాట్స్ చెప్పాడు, ఇకపై ఆ హీరో నీ సొంతం అని కామెంట్ చేశాడు.
ఆ పోస్టును కొంతమంది వెలికితీసి మరోసారి వైరల్ చేశారు. నాగచైతన్య-సమంత విడిపోవడానికి శోభితానే కారణమా అనే అర్థం వచ్చేలా కామెంట్స్ పడుతున్నాయి.
మరోవైపు చైతూ-సమంత విడిపోయిన టైమ్ లో “ఫ్యామిలీమేన్ సీజన్-2” ఇష్యూ కూడా నడిచింది. అందులో సమంత కాస్త బోల్డ్ గా నటించింది. అందుకే చైతూ ఆమె నుంచి విడిపోయాడంటూ కొంతమంది ఊహించుకున్నారు. అలా చూసుకుంటే, ఎన్నో సినిమాల్లో, మరికొన్ని వెబ్ సిరీసుల్లో సమంత కంటే బోల్డ్ గా నటించింది శోభిత. ఆ క్లిప్పింగ్స్ ను కూడా జనం వైరల్ చేస్తున్నారు.
ఇక్కడే మరో కోణం కూడా వెలికి తీస్తున్నారు. గతంలో ఆగస్ట్ 8 న సమంత, నాగచైతన్యకు ప్రపోజ్ చేసిందంట. 8వ నెల, 8వ తేదీన సమంత ప్రపోజ్ చేసిందని.. ఇప్పుడు ఆమెపై రివెంజ్ తీర్చుకునేలా అదే డేట్ సెట్ చేసి మరీ నాగచైతన్య, శోభిత వేలికి ఉంగరం తొడిగాడని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇలా నాగచైతన్య-సమంత-శోభిత చుట్టూ చాలా పోస్టులు, వాదనలు, చర్చలు, ట్రోల్స్.. సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.