తన సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ కి ఒక్కో ప్రెస్ మీట్ పెడుతున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఇప్పటికే ఎన్నో మీడియా సమావేశాలు పెట్టారు. తాజాగా కూడా మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి తెలుగు భాషా దినోత్సవం పేరిట సమావేశం ఏర్పాటుచేశారు. ఎప్పట్లానే ఎన్టీఆర్, హరికృష్ణ చిత్రపటాలకు పూజలు చేశారు.
ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పెట్టి, స్వీయదర్శకత్వంలో వైవీఎస్ చౌదరి ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా వీణ రావును తీసుకున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో మేటర్ బయటపెట్టారు చౌదరి. ఇదొక పీరియడ్ సినిమా అంట. కథ 1980 నేపథ్యంలో సాగుతుందంట. అంతేకాదు, తెలుగు భాష, సంస్కృతిని చాటిచెప్పే సినిమా అంట.
తెలుగు భాష, సంస్కృతి, విలువల్ని చాటిచెబుతూ ఎప్పట్నుంచో ఓ సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నారట వైవీఎస్. అయితే డాక్యుమెంటరీలా కాకుండా, కమర్షియల్ గా వాటిని చెప్పాలని అనుకున్నారట. నందమూరి తారకరామారావు సినిమాతో అది ఇన్నాళ్లకు నెరవేరుతుందని అంటున్నారు.