హీరోయిన్ ప్రణీత మళ్ళీ తల్లి కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ భామ మళ్ళీ గర్భం దాల్చింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఘనంగా ప్రకటించింది.
ఇప్పుడు బేబీ బంప్ తోనే రకరకాల డ్రెస్సులు వేసుకొని నిత్యం ఎదో ఒక ఫోటోషూట్ చేస్తోంది. వాటిని షేర్ చేస్తోంది. ఇలా ప్రెగ్నన్సీతో రకరకాల ఫోటోషూట్ల చెయ్యడం గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చాలా అతి చేస్తున్నావు అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు గర్భవతి కాగానే సైలెంట్ గా కూర్చొని ఇంటికే పరిమితం కాకుండా ఇలా ఎదో ఒక యాక్టివిటీ చేస్తున్నావు అంటూ మెచ్చుకుంటున్నారు.
ఐతే అసలు విషయం ఏంటంటే ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ ఎదో ఒక అప్ డేట్ చేస్తేనే ఫాలోవర్స్ ఉంటారు. లేదంటే తగ్గిపోతారు. దాని కారణంగా ఆదాయం తగ్గిపోతుంది. అందుకే ఈ భామ ఇలా హంగామా చేస్తోంది.
ఈ భామ వ్యాపారవేత్త నితిన్ ను పెళ్లాడింది ప్రణీత. 2022లో మొదటి పాపకి జన్మించింది. ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అవుతోంది.