హీరోయిన్ శృతిహాసన్, ప్రభాస్ కలిసి “సలార్” సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల చాలా కాలమే అయింది. అయినా ఆమె మరోసారి ప్రభాస్ ను గుర్తు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే, ఒక విషయంలో ప్రభాస్ ను ఆమె అస్సలు మరిచిపోలేకపోతోంది.
ప్రభాస్ ఇచ్చిన అతిథ్యం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెబుతోంది. అందుకే మరిచిపోలేకపోతుందట.
“సలార్’ సినిమా చేస్తున్న టైమ్ లో శృతిహాసన్ కు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చాడు ప్రభాస్. టేబుల్ నిండా వంటకాలు వడ్డించాడంట. కొన్ని వంటకాలు చల్లారిపోకుండా ఉండేందుకు పెద్దపెద్ద హాట్ బాక్సుల్లో పెట్టాడంట. ప్రతి వంటకాన్ని కొసరి మరీ వడ్డించేవాడంట.
రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఫుడ్ వ్లాగర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది శృతిహాసన్. అతడు పెట్టిన వంటకాలు చూసి, ప్రభాస్ ను మరోసారి గుర్తుచేసుకుంది. నటుడ్ని కాకపోయి ఉన్నట్టయితే ప్రతి రోజూ రకరకాల వంటకాలు రుచిచూసేవాడినని శృతిహాసన్ తో ప్రభాస్ చెప్పాడట .
ఈ ఏడాది “సలార్ 2 ” మొదలు కావాలి. కానీ ఆ ఆలోచనని ప్రస్తుతం విరమించుకున్నారు. ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాయలు కూడా కనిపించడం లేదు. ప్రభాస్ తో షూటింగ్ ను బాగా మిస్ అవుతున్నానని అంటోంది శృతిహాసన్.