హీరో రామ్ ఒక సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమా సెట్ చేసుకుంటాడు. కానీ ఈ సారి ఆయన లెక్క తప్పింది. ఈ ఏడాది మార్చిలో విడుదల కావాల్సిన “డబుల్ ఇస్మార్ట్” ఇంకా రిలీజ్ కాలేదు. మూడు నెలలుగా షూటింగ్ ఆగింది. మరో 20 శాతం పూర్తి చెయ్యాలి.
ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే ఈ సినిమా ఆగిపోవడానికి రామ్ కారణం అంటూ ఇటీవల ఒక వర్గం మీడియా హడావిడి చేసింది. కానీ నిజం ఏంటంటే రామ్ అస్సలు కారణం కాదు. “డబుల్ ఇస్మార్ట్”కి అసలైన సమస్య ఆర్థికపరమైన కారణాలు. అవి ఇప్పుడు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.
ఇక రామ్ పోతినేని మరో కొత్త సినిమా ప్రకటిస్తాడా అనేదే ప్రశ్న.
రామ్ ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. ఆయనకి మాస్ సినిమాని సరిగా హ్యాండిల్ చేసే దర్శకుడు కావాలి. అందుకే కొత్త సినిమా విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.