అచ్చ తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా చాలా కాలంగా నటిస్తోంది. “కలర్ ఫోటో” తర్వాత “గామి” చిత్రం ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా వైవిధ్యమైన సినిమాలు, భిన్నమైన పాత్రలను చేస్తానని చెప్తోంది. ఆ క్రమంలో ఆమె ఇప్పుడు పోలీస్ అవతారం ఎత్తింది.
ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్న చిత్రం.. ‘యేవమ్’.ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకుడు. “ఈ సినిమాలో చాందిని చౌదరి పాత్ర మహిళా సాధికారితను తెలుపుతుంది. ఆమె నటన హైలైట్. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్ నేరేషన్ వుంది,” అన్నారు దర్శకుడు. వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ఇతర పాత్రలు పోస్టిస్తున్నారు ఇందులో.
మరి చాందిని చౌదరి మరో విజయశాంతిలా పోలీస్ గా రాణిస్తుందా?