పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. తన కొత్త ప్రస్థానంలో ఆయన తలమునకలై ఉన్నారు. మరి నటుడిగా ఆయన ప్రస్థానం ఇక ఎలా ఉండబోతుంది? రాజ్యాంగం ప్రకారం ఆయన నటించకూడదనే నిబంధన లేదు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఒక సినిమాలో నటించారు. మళ్ళీ మాజీగా అయ్యాకే ఆయన మేకప్ వేసుకున్నారు.
మరి పవన్ కళ్యాణ్ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. కొత్త సినిమాల సంగతేమో కానీ ఇప్పటికే మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమాలనైతే పూర్తి చెయ్యాలి.
ఆయన సగం/కొంతభాగం పూర్తి చేసిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఓజి (70 శాతం షూటింగ్ పూర్తి అయింది)
- హరి హర వీర మల్లు -1 (మొదటిభాగం సంబంధించినంతవరకు 80 శాతం పూర్తి అయింది)
- ఉస్తాద్ భగత్ సింగ్ (కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది ఇప్పటివరకు)
ఈ మూడింటిలో పవన్ కళ్యాణ్ పై రెండు చిత్రాల షూటింగ్ ఈ ఏడాది పూర్తిచేస్తే ఒక్కటైనా వస్తుంది. లేదంటే వచ్చే ఏడాదే. మరి ఇందులో “ఓజి” ముందు వస్తుందా? “హరి హర వీర మల్లు -1 ” ముందు వస్తుందా అనేది చూడాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇందులో ఒక్కటీ కూడా ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి లేదు.