మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే సినిమాల్లో నటించాడు. “1 నేనొక్కడినే” అనే సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ఇప్పుడు గౌతమ్ టీనేజ్ లో ఉన్నాడు. మరో నాలుగు, ఐదేళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఐతే, ఇప్పటి నుంచే తన నటనకు పదును పెట్టుకుంటున్నాడు గౌతమ్. తాజాగా లండన్లో ఒక నాటక ప్రదర్శన ఇచ్చాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియచేశారు. కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
“రోమియో జూలియట్ అండ్ ఎట్సెట్రా” అనే నాటక ప్రదర్శనలో గౌతమ్ పాల్గొన్నాడు. “జాయ్ ఆఫ్ డ్రామా” అనే సంస్థ వేసవిలో నిర్వహించే ఈ నాటక ప్రదర్శనలలో చాలామంది ధనవంతుల పిల్లలు పాల్గొంటారు. గౌతమ్ తన మొదటి స్టేజ్ ప్రదర్శన ఇలా చెయ్యడంతో మహేష్ బాబు, నమ్రత ఆనందానికి అవధులు లేవు.
తన కొడుకు ప్రదర్శన బాగా నచ్చింది అని ఆమె గర్వంగా చెప్పింది.
Advertisement