బాహుబలి 2, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్, పౌర్ణమి, మున్నా…. ఇలా ప్రభాస్ కెరీర్ లో చాలా సినిమాలు ఏప్రిల్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అదే ఏప్రిల్ కు మరో సినిమాను సిద్ధం చేస్తున్నాడు ప్రభాస్. అదే “ది రాజా సాబ్” మూవీ.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10కి విడుదల చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెల ప్రభాస్ కు బాగా కలిసొచ్చింది. 2 సినిమాలు మినహా, మిగతావన్నీ బాగా ఆడాయి. సో.. “ది రాజాసాబ్”కు ఆ సెంటిమెంట్ బాగానే కలిసొస్తుందంటున్నారు ఫ్యాన్స్.
వింటేజ్ ప్రభాస్ ను చూపించే లక్ష్యంతో “రాజాసాబ్”ను తెరకెక్కిస్తున్నారు. డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్ లో కనిపించిన చిలిపి ప్రభాస్ మరోసారి ప్రేక్షకులముందుకు వస్తాడంటున్నాడు దర్శకుడు మారుతి. ఆ రెండు సినిమాలూ ఏప్రిల్ లోనే రిలీజ్ అయ్యాయి.
ALSO READ: The Raja Saab’s glimpse and release date are out
రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది “రాజా సాబ్” సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.