
రష్మిక మందాన నిజమైన పాన్ ఇండియన్ హీరోయిన్. ఆమెకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ లో అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆమెకి బాలీవుడ్ లోనే ఎక్కువ డిమాండ్, క్రేజ్ ఉంది. అందుకే, ఈ భామ ఇటు తెలుగు సినిమాలు, అటు హిందీ సినిమాలు సమానంగా చేస్తోంది.
ఆమె సంపాదన బాగుంది. కానీ ఇలా తెలుగు, హిందీ సినిమాల కారణంగా నెలకు 10, 15 సార్లు ముంబై – హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోందట. ఆమె విమాన ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అలాగే, అటు ఇటు చక్కర్ల కారణంగా ఎక్కువగా అలిసిపోతోందట.
ఆ విషయాన్ని ఆమె ఇటీవల బయటపెట్టింది. ఐతే, తనకు పనిలోనే ఎక్కువ సంతృప్తి దక్కుతుంది అని కూడా పేర్కొంటోంది. ట్రిప్పుల తిప్పలు మినహా మిగతా అంతా సూపర్ గానే ఉందని చెప్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రాలు ఇవే.
- కుబేర
ఇందులో ధనుష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కథ కూడా కొంత భాగం ముంబై నేపథ్యంగా సాగుతుంది. శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. - పుష్ప 2
ఇందులో ఆమె శ్రీవల్లిగా నటిస్తోంది. అల్లు అర్జున్ భార్య పాత్ర ఆమెది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకొంది. - ది గర్ల్ ఫ్రెండ్
ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.

హిందీ చిత్రాలు ఇవే
- సికిందర్
సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న భారీ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మురుగదాస్ తీస్తున్న ఈ భారీ సినిమా కోసమే ప్రస్తుతం ముంబైలో ఎక్కువగా ఉంటోంది. - చావా
విక్కీ కౌశల్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది.
ఈ సినిమాలు కాకుండా ఆమె అనేక యాడ్స్ లో నటిస్తుంటుంది. అలాగే, ఎన్నో ఫ్యాషన్ మేగజైన్ లకు ఫోటోషూట్ లు చేస్తూ ఉంటుంది. వీటి కోసం కూడా ఆమె తరుచుగా ముంబైకి వెళ్ళాలి. ఇప్పటికే ముంబైలో ఆమె ఒక అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకొంది. ఇక హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది.