అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటించారు.
– అశ్విన్ బాబు పుట్టిన రోజు, నా పుట్టిన రోజు ఒకటే రోజు. అదే ఆగస్ట్ 1. అంతే కాకుండా అన్ని రకాలుగా ఆ రోజు అనుకూలంగా ఉంది. అందుకే విడుదల చేస్తున్నాం.
– శివం భజే కథను కథను పూర్తిగా రివీల్ చేయలేను. చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్‌కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిపినట్టు ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేలా అంశాలు ఉంటాయి. విక్టరీ వెంకటేష్ గారు ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమా చూస్తారు. టికెట్ రేట్లు తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా కూడా సినిమా బాగుందనే మౌత్ టాక్ వస్తేనే సినిమాను చూస్తారు.
– ‘ఐఐటీ కృష్ణమూర్తి’ టీంతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం.