ప్రభాస్-అనుష్క….హిట్ జంట. వెండితెరపై వీళ్లు చూడముచ్చటగా ఉంటారు. ఆ ఎత్తు, బరువు, కెమిస్ట్రీ.. ఆ లెక్కే వేరు. ప్రభాస్ తర్వాత అనుష్క హైట్ కు మ్యాచ్ అయిన ఒకే ఒక్క హీరో గోపీచంద్.
గోపీచంద్-అనుష్క కూడా తెరపై చూడ్డానికి చాలా బాగుంటారు. వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనే డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం “లక్ష్యం” సినిమా.
ఉన్నఫలంగా ఈ చర్చ మొదలవ్వడానికి ఓ కారణం ఉంది. గోపీచంద్-అనుష్క కలిసి చేసిన “లక్ష్యం” సినిమా తాజాగా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాపై ఆసక్తికర చర్చసాగింది. అనుష్క, గోపీచంద్ మళ్లీ కలవాలని, వాళ్లను హీరోహీరోయిన్లుగా పెట్టి ఎవరైనా సినిమా తీయాలంటూ సోషల్ మీడియాలో గోపీచంద్ ఫ్యాన్స్, అనుష్క ఫ్యాన్స్ కోరుతున్నారు.
అనుష్కతో నటించడానికి గోపీచంద్ ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అనుష్కతో సినిమాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు కూడా. ఎటొచ్చి బొమ్మాళి మాత్రం సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది.