
ట్రావెలింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ సరైన కంపెనీ చాలామందికి దొరకదు. తనకు అలాంటి సమస్య లేదంటోంది హీరోయిన్ నభా నటేష్.
ఎక్కడికైనా తను ఒంటరిగానే వెళ్తానని, సోలో ట్రావెలింగ్ అంటే తనకు ఇష్టమని అంటోంది.
“నేనెప్పుడూ సోలోగా ట్రావెల్ చేయడానికే ఇష్టపడతాను. కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా సోలోగానే ట్రిప్స్ కు వెళ్తుంటాను. 15 ఏళ్ల వయసు నుంచే నేను ఇంటికి దూరంగా ఉన్నాను. స్కూల్ లో చదువుకునేటప్పుడు ఒక్కదాన్నే బస్సుల్లో తిరిగేదాన్ని. ప్రపంచాన్ని చూడాలని, సమాజాన్ని అర్థం చేసుకోవాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. అందుకే ఎక్కువగా ట్రావెల్ చేసేదాన్ని.”
“ఇస్మార్ట్ శంకర్” రిలీజ్ టైమ్ లో చార్మినార్ దగ్గరికి వెళ్ళింది నభా నటేష్. ఆ సినిమా హిట్టయింది. మళ్లీ “డార్లింగ్” కోసం చార్మినార్ కు వచ్చింది. సో.. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా ఉందని చెబుతోంది.ఆమె నటించిన కొత్త చిత్రం… “డార్లింగ్” ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రొమోషన్ మొదలైంది. ఈ సందర్భంగా తన ట్రావెల్ హ్యాబిట్స్ ను బయటపెట్టింది నభా.