
పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వీటిలో సెట్స్ పై ఉన్న సినిమాలు 3. హరీశ్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్”, సుజీత్ దర్శకత్వంలో “ఓజీ”, “హరి హర వీరమల్లు” సినిమాలు చేస్తున్నాడు పవన్.
ఇప్పుడీ 3 సినిమాల్లో 2 సినిమాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అవే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు. మొన్నటివరకు ఓజీ సినిమా ముందొస్తుందనే ప్రచారం సాగింది. దానికి కారణం, ఆ సినిమా విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించడమే.
సెప్టెంబర్ 27న “ఓజీ” వస్తుందని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడా తేదీకి ఆ సినిమా రాదని తేలిపోయింది. అదే టైమ్ లో “హరిహర వీరమల్లు” సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామంటూ వరుస ప్రకటనలు గుప్పిస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం.
దీంతో ఓజీ, వీరమల్లు సినిమాల్లో ఏది ముందు వస్తుందనే సందిగ్దం అందర్లో ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే పవన్ సెట్స్ పైకి రావాలి. పవన్ ఏ సినిమాకు ముందుగా కాల్షీట్లు కేటాయిస్తే, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందనేది ఓ అంచనా.