మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ షూటింగ్ జోరుగా సాగుతోంది. “బింబిసార” తీసిన వశిష్ట ఈ సినిమాకి దర్శకుడు. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు వివి వినాయక్ సెట్ కి విచ్చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వి వి వినాయక్ కలసివున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.
వినాయక్ ఇటీవల సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేరు. దర్శకుడిగా సినిమాలు తీసి చాలా ఏళ్ళు అవుతోంది. కానీ, సినిమా ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితమైన వారి సెట్స్ కి వెళ్తుంటారు. చిరంజీవితో వినాయక్ కి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో “ఠాగూర్ “, “ఖైదీ నంబర్ 150” వంటి సినిమాలు వచ్చాయి.
ఇక దర్శకుడు వశిష్ఠ వినాయక్ వద్ద పని చేశారు. అలాగే వశిష్ఠ తండ్రి వినాయక్ దర్శకత్వంలో సినిమాలు నిర్మించారు.
“విశ్వంభర” వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
Advertisement