
పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం… అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో విడుదలైన ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కలిసి నటించిన ఆ చిత్రం చాలా అంచనాల మధ్య విడుదలైంది.
సినిమా ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ పెద్ద హీరోగానే ఎదగడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అత్యంత ఉన్నతస్థానానికి చేరుకున్నారు.
ఇక సుప్రియ ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా కెరీర్ కొనసాగించలేదు. కానీ అగ్ర నిర్మాతగా స్థిరపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తంగా ఆమె చూసుకుంటారు. స్టూడియో అధినేత్రిగా ఆమె కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిశారు.
తెలుగు సినిమాకి చెందిన పలువురు నిర్మాతలు ఈ రోజు పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ బృందంలో సుప్రియ కూడా ఉన్నారు.