![Vishwak Sen](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/12/vishwaksen-sonukiller.jpg)
మన హీరోలు లేడీ గెటప్స్ వేయడం కొత్త కాదు. చిరంజీవి నుంచి చాలామంది నటులు లేడీ లుక్స్ లోకి మారారు. రాజేంద్రప్రసాద్ వేసిన లేడీ గెటప్ మాత్రం ఐకానిక్ గా మారింది. ఇప్పుడిలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడున్న తెలుగు యంగ్ హీరోస్ లో లేడీ గెటప్ లోకి మారుతున్న మొదటి హీరో బహుశా ఇతడే.
‘లైలా’ సినిమా చేశాడు విశ్వక్ సేన్. ఇందులో అతడు అందమైన అమ్మాయిలా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి తాజాగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. కేవలం కళ్లు, ముక్కు, లైట్ గా హెయిర్ స్టయిల్ మాత్రమే చూపించారు. ఆ లుక్ చాలా బాగుంది.
ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడమే లేటు అనుకున్న టైమ్ లో అఁదరికీ షాకిచ్చాడు విశ్వక్ సేన్. ప్రీ-లుక్ ఒకటి రిలీజ్ చేసి, ఫస్ట్ లుక్ కింద మరో ఫొటో విడుదల చేశారు. పైన చెప్పుకున్నట్టు ప్రీ-లుక్ లో లేడీ గెటప్ ఛాయలు చూపించి, ఫస్ట్ లుక్ లో స్టయిలిష్ గా కనిపించే, రిచ్ కిడ్ విశ్వక్ లుక్ ను విడుదల చేశారు.
ALSO READ: Laila: Vishwaksen’s stylish look unveiled
ఉమెన్ లుక్ వస్తుందనుకుంటే, మేన్ లుక్ రిలీజ్ చేశారంటూ నెట్ లో విశ్వక్ పై ట్రోలింగ్ నడుస్తోంది. ఎందుకిలా ఆఖరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారనేది వాళ్లకే తెలియాలి.