రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు. అమెరికాలోని డాలస్ లో జరిగిన ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అంతకుమించి మరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఈసారి విజయవాడ కేంద్రంగా జరగనుంది.
విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో గేమ్ ఛేంజర్ కోసం భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. 29న జరగనున్న ఈ కార్యక్రమంలో భారీ రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. 250 అడుగుల భారీ కటౌట్ ఇది. ఓ హీరోకు ఇండియాలో ఇంత పెద్ద కటౌట్ ఇంతవరకు ఏర్పాటుచేయలేదంటున్నారు మెగా ఫ్యాన్స్.
అదే ఈవెంట్ లో హెలికాప్టర్లు పెట్టి పూల వర్షం కురిపించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చు చేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కింది ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘ధోప్’ సాంగ్ రిలీజ్ చేశారు. అది క్యాచీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది ‘గేమ్ ఛేంజర్’.