కీర్తి సురేష్ నటించిన మొదటి హిందీ చిత్రం ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైంది. తమిళంలో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన “తెరి” సినిమాకి రీమేక్ ఇది. “తెరి” డైరెక్ట్ చేసిన అట్లీ ఈ సినిమాకి నిర్మాత, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి తీశారు. ఐతే, ఈ సినిమాకి క్రిటిక్స్ చాలా యావరేజ్ రేటింగ్ ఇచ్చారు.
సాధారణ ప్రజల టాక్ కూడా అలాగే ఉంది. సినిమా నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఓపెనింగ్స్ మాత్రం ఫర్వాలేదు అన్నట్లుగా వచ్చాయి.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ వరుణ్ ధావన్ కి భార్యగా నటించింది. “తెరి”లో సమంత నటించిన పాత్రలాంటిది. ఈ సినిమాలో కీర్తి నటనకు కూడా చాలా యావరేజ్ మార్కులే వచ్చాయి క్రిటిక్స్ నుంచి. ఆమె పోషించిన పాత్ర అలాంటిది.
ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ భామకి బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే చిత్రం కాదిది.