ప్రముఖ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో ఒక మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి “డార్క్ నైట్” అనే పేరు పెట్టారు.
సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ సరసన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) నటించారు. విధార్థ్, సుభాశ్రీ రాయగురు మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
“డార్క్ నైట్ లో పూర్ణ నటన హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు జి.ఆర్.ఆదిత్య ఈ చిత్రాన్ని అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ట్విస్ట్ లతో కట్టిపడేశాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనం ఉంది ఈ సినిమాలో. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్,” అని నిర్మాత అన్నారు.
త్వరలోనే ఈ సినిమాకి విడుదల తేదీ ప్రకటిస్తారు.