‘జైలర్’ విలన్ వినాయగన్ కు పోలీస్ కేసులు కొత్త కాదు. గతంలోనే ఓ దొమ్మీ కేసులో ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో కేసులో అరెస్ట్ అయ్యాడు ఈ స్టార్ విలన్. ఈసారి అతడ్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం గమనార్హం.
కొచ్చిలో ఓ షూటింగ్ ముగించుకొని గోవాకు బయల్దేరాడు వినాయగన్. మధ్యలో హైదరాబాద్ లో కనెక్టింగ్ ఫ్లయిట్. ఆ గ్యాప్ లోనే గొడవ జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై వినాయగన్ చేయి చేసుకున్నాడనేది ఆరోపణ.
దీంతో అతడ్ని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని, శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. గొడవ జరిగిన సమయంలో వినాయగన్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
వినాయగన్ అరెస్ట్ తో గోవాలో జరగాల్సిన అతడి కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది. అతడికి సోమవారం బెయిల్ వచ్చే అవకాశం ఉంది.
Advertisement