వినాయక చవితిని తెలుగు సినిమా పరిశ్రమ కోలాహలంగా జరుపుకుంది. చాలామంది స్టార్స్ తమ చవితి సంబరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి పూజను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ ఏడాది పూజను అర్హ చేతుల మీదుగా జరిపించడం విశేషం. అంతేకాదు, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కుటుంబమంతా కలిసి గీతాఆర్ట్స్ ఆఫీస్ లో జరిగిన పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.
హీరో శర్వానంద్, తన కూతురు లీలాదేవితో చవితి సంబరాల్ని జరుపుకున్నాడు. అటు నాగబాబు ఇంట్లో కొత్త కోడలు లావణ్య త్రిపాఠి వినాయక పూజ నిర్వహించింది. రకుల్ ప్రీత్ సింగ్, తన భర్తతో కలిసి పూజ చేసింది.
సందీప్ కిషన్ అయితే ఏకంగా తన వినాయక చవితి సంబరాల్ని వీడియో చేసి పెట్టాడు. కుటుంబంతో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశామని తెలిపాడు.
నాగశౌర్య కూడా తన సంబరాల ఫొటోలు పోస్ట్ చేశాడు. వీళ్లందరికంటే వెరైటీగా వినాయక చవితి జరుపుకున్నాడు విశ్వక్ సేన్. తన చేతులతో మట్టి గణపతిని తయారుచేసి, ఆ వీడియోను షేర్ చేశాడు.