రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో నిన్నటివరకు రాజ్ తరుణ్ దే పైచేయి. ఎఁదుకంటే, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా నిన్నటివరకు. ఈరోజు లావణ్య పైచేయి సాధించింది.
లావణ్యకు నార్సింగి పోలీసులు అండగా నిలిచారు. ఆమె ఇచ్చిన సమాచారం, చూపించిన సాక్ష్యాధారాల్ని పోలీసులు పూర్తిగా నమ్మారు. అందుకే రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ తెరిచారు. రాజ్-లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్టు అందులో పొందుపర్చిన పోలీసులు, దానికి సంబంధించి లావణ్య సమర్పించిన ఆధారాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు ముగిసేలోపు రాజ్ తరుణ్ ఏదో ఒకటి చేయాలి. లేదంటే పోలీసులు రంగంలోకి దిగుతారు. త్వరలోనే ఈ ఛార్జ్ షీట్ ను ఆధారాలతో పాటు కోర్టుకు సమర్పించబోతున్నారు పోలీసులు.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు మరోసారి మీడియా ముందుకొచ్చింది లావణ్య. పలు సందర్భాల్లో రాజ్ తరుణ్ కు తన 70 లక్షల రూపాయలిచ్చినట్టు ఆరోపించింది. తన తల్లిదండ్రులు 2 స్థలాలు అమ్మి, ఆ డబ్బును సమకూర్చారని.. వాటికి సంబంధించిన లావాదేవీల పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.