త్రిష హీరోయిన్ గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొంది. ఇన్నేళ్ళలో ఆమె ఐటెం సాంగ్స్ చెయ్యలేదు. మొదటి సారిగా “గోట్” అనే సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ చేసి వెళ్ళింది.
విజయ్ హీరోగా నటించిన “గోట్” నిన్న (సెప్టెంబర్ 5, 2024) విడుదలైంది. ఈ సినిమాలో ‘మస్తీ’ అనే పాటలో విజయ్ తో కలిసి డ్యాన్స్ చేసింది త్రిష. పసుపుపచ్చ చీర కట్టుకొని ఈ పాటలో దర్శనమిచ్చింది. ఇది పూర్తిగా ఐటెం సాంగ్ కాదు. అలాగని ఆమె చేసింది గెస్ట్ రోల్ కాదు. ఆ పాటలో కొంత సేపు విజయ్ తో కలిసి డ్యాన్స్ చేసింది అంతే. అదీ కూడా మ్యూజిక్ బిట్ కే.
విజయ్, త్రిష మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే ఆమె విజయ్ కోసం ఈ చిన్న సాంగ్ లో డ్యాన్స్ చేసింది అని అంటున్నారు. ఐటెం సాంగ్ గా కాకుండా స్పెషల్ డ్యాన్స్ బిట్ అని ఒప్పుకొంది. ఐతే, ఈ సినిమాలో ఆమె కనిపించిన సందర్భం బాలేదు. అందుకే, ఆమె స్పెషల్ అప్పీయరెన్స్ సినిమాకి ఉపయోగపడేది కాదు.
ప్రస్తుతం త్రిష తెలుగులో చిరంజీవి సరసన “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది.