
విజయశాంతిని ఒకప్పుడు ‘లేడీ అమితాబ్’ అనేవారు. ఆ రేంజ్ లో ఆమె యాక్షన్ చేసేవారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు విజయశాంతి యాక్షన్ చేశారు.
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో ఫైట్స్ చేశారు విజయశాంతి. లాంగ్ గ్యాప్ వచ్చినప్పటికీ ఫస్ట్ షాట్ లోనే ఫైట్ సీన్ ఓకే చేశారట. దీంతో యూనిట్ లో అంతా ఆశ్చర్యపోయారట. దీనిపై విజయశాంతి స్పందించారు.
“అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ విజయశాంతే. అదే పౌరుషం, అదే రోషం. తగ్గేదేలే. ఎంత వయసు పెరిగినా ఇలానే స్ట్రాంగ్ గా ఉంటాను. నాకు మా అమ్మానాన్న ఆ క్రమశిక్షణ నేర్పారు. ఏ పనైనా అంకితభావంతో చేస్తాను.”
ఈ సినిమా టీజర్ లాంఛ్ లో పాల్గొన్నారు విజయశాంతి. కల్యాణ్ రామ్ తన డెడికేషన్ తో ఆశ్చర్యపరిచాడని మెచ్చుకున్నారు. గతంలో మహేష్ బాబుతో, ఇప్పుడు కల్యాణ్ రామ్ తో కలిసి పనిచేసిన విజయశాంతి… వర్క్ విషయంలో మహేష్, కల్యాణ్ రామ్ ఇద్దరూ ఒకటేనన్నారు. పనిచేయాలనే కసి ఇద్దర్లో సమానంగా ఉందన్నారు.