
‘సలార్’ క్రేజ్ ఇంకా మార్కెట్లో నడుస్తోంది. సినిమా వచ్చి ఇన్నాళ్లయినా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఓటీటీలో ఈ సినిమా ఏడాది పాటు ట్రెండ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి మరో సందడి మొదలైంది.
‘సలార్’ సినిమా నుంచి ప్రభాస్ ప్రతిమల్ని రిలీజ్ చేసింది హోంబలే సంస్థ. వీటిని ఆన్ లైన్లో పెట్టి ముందుగానే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. 3 రూపాల్లో ప్రభాస్ సలార్ ప్రతిమల్ని తయారుచేసింది హోంబలే.
వీటిలో ఒకటి కాటేరమ్మ ఫైట్ సీన్ ను గుర్తు చేస్తుంది. ఇక మిగతా 2 బొమ్మల్లో ఒకదాంట్లో కత్తి పట్టిన ప్రభాస్ ను, మరో బొమ్మలో సంకెళ్లతో కట్టేసిన ప్రభాస్ ను తయారుచేశారు. వీటిలో కాటేరమ్మ ఫైట్ ప్రతిరూపాన్ని 4299 రూపాయలకు అమ్మబోతున్నట్టు ప్రకటించింది హోంబలే. మిగతా 2 బొమ్మలకు చెరో రూ.2999 రేటు ఫిక్స్ చేశారు.
అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ అభిమానులే ఈ బొమ్మలు చూసి పెదవి విరుస్తున్నారు. బొమ్మల్లో ప్రభాస్ ముఖం అస్సలు ఆయన పోలికలతో లేదని కొందరు అంటుంటగా, మరికొంతమంది మాత్రం బొమ్మలకు ధర ఎక్కువగా పెట్టారని కామెంట్ చేస్తున్నారు.