
సిద్ధూ జొన్నలగడ్డ ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. “డీజే టిల్లు” సినిమాతో స్టార్ అయ్యాడు. ఆ సినిమాలో సిద్ధూ, హీరోయిన్ నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ అదిరింది. సిద్ధూని మోసం చేసే రాధిక పాత్ర నేహా అదరగొట్టింది. అలాగే దానికి సీక్వెల్ గా వచ్చిన “టిల్లు స్క్వేర్”లో కూడా సిద్ధూ, అనుపమ పరమేశ్వరన్ పాత్రల మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలెట్.
హీరోయిన్లతో సిద్ధూ కెమిస్ట్రీ వర్కవుట్ ఐతే సినిమా హిట్. అందుకే, ఇప్పుడు “జాక్”లో హీరోయిన్ వైష్ణవి చైతన్యతో అతని కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి మొదలైంది. “బేబీ” సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో సిద్ధూకి జోడిగా నటించింది.
వీరి మధ్య కిస్ సీన్లు కూడా ఉన్నాయట. తాజాగా వీరి మధ్య కెమిస్ట్రీని చూపే “కిస్” పాట రానుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వీరి మధ్య లవ్ సీన్లు, కెమిస్ట్రీ బాగుంటే సినిమాకి మంచి హైప్ వస్తుంది. సెట్ లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసిన వాళ్ళు “జంట” బాగుంది అని అంటున్నారు. మరి అది తెరపై ప్రతిబింబిస్తే సిద్ధూకి మరో హిట్. ‘బేబీ’ వైష్ణవి చైతన్యకి కూడా ఇంకో హిట్ ఖాతాలో పడుతుంది.
ఏప్రిల్ 10న విడుదల కానుంది “జాక్”.