
ఓవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా ప్రచారంతో కాకుండా, మరో వివాదంతో వార్తల్లోకెక్కారు విజయశాంతి.
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ చంద్రకిరణ్ రెడ్డి ఎవరో తెలుసా? నిన్నమొన్నటి వరకు విజయశాంతి సోషల్ మీడియా ఎకౌంట్స్ మెయింటైన్ చేసింది ఇతడే.
ఇతడ్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారట విజయశాంతి. అయితే అతడు మాత్రం విజయశాంతి ఎకౌంట్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేదట. దీంతో అతడ్ని తొలిగించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆ రెడ్డి, విజయశాంతిని బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.