
నిజంగా అదృష్ఠమంటే ప్రియా వారియర్ దే. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే గతంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి అదే అదృష్టం ఆమెకు బ్రేక్ తెచ్చిపెట్టింది.
ఆమె ఎలా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ మలయాళం సినిమాలో ఓ పాటలో ఆమె కన్నుకొట్టింది. ఆ ఒక్క వింక్ మూమెంట్ ఆమెను స్టార్ ను చేసేసింది. ఆ సినిమా ఎవ్వరికీ గుర్తులేదు, అందులో నటించిన హీరోహీరోయిన్లు కూడా ఎవ్వరికీ తెలియదు.
కానీ ప్రియా వారియర్ కన్నుకొట్టిన మూమెంట్ మాత్రం వైరల్ అయిపోయింది. అదృష్టంకాక ఇంకేంటి? ఇప్పుడు అలాంటి అదృష్టమే ఆమెను మళ్లీ వరించింది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా చేసింది ప్రియా వారియర్. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర. అయితే ఈసారి కూడా ఆమె తన క్యారెక్టర్ తో క్లిక్ అవ్వలేదు. సినిమా క్లయిమాక్స్ లో అజిత్ వింటేజ్ సాంగ్ కు అర్జున్ దాస్ తో కలిసి డాన్స్ చేసింది ప్రియా. ఆ ఒక్క డాన్స్ బిట్ ఆమెను కోలీవుడ్ లో పాపులర్ చేసింది. తమిళనాట అంతా ఇప్పుడా డాన్స్ బిట్ గురించే మాట్లాడుకుంటున్నారు.