ఎప్పుడైతే తమిళ బిగ్ బాస్ కొత్త సీజన్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారో, ఆ వెంటనే విజయ్ సేతుపతి పేరు వినిపించింది. ఇప్పుడు విజయ్ సేతుపతిని అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 8ను ఇకపై విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తారు.
వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్ కు న్యాయం చేయలేనని, అందుకే తప్పుకుంటున్నానని ప్రకటించారు కమల్ హాసన్. ఆ వెంటనే విజయ్ సేతుపతి పేరు తెరపైకొచ్చింది. దీంతో సీజన్-8ను సేతుపతి ఎలా హోస్ట్ చేస్తాడనే ఆసక్తి అందర్లో నెలకొంది.
ఆ ఆసక్తి ఆధారంగానే తాజా ప్రోమోను కట్ చేయడం విశేషం. వివిధ వర్గాల ప్రేక్షకుల ఆలోచనలను ప్రతిబింబిస్తూ, ఫైనల్ గా సీజన్-8 ను విజయ్ సేతుపతి ప్రకటిస్తాడు. ఈ షో కోసం సేతుపతికి భారీ మొత్తంలో పారితోషికం దక్కినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు విజయ్ సేతుపతి. కెరీర్ లో అతడికిది 50వ చిత్రం. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలా బిగ్ బాస్ రూపంలో కొత్త పాత్రలోకి ప్రవేశించాడు విజయ్ సేతుపతి.