మహేష్ బాబు ఇంతకుముందు ఎప్పుడూ గుబురు గడ్డంతో కనిపించలేదు. ట్రిమ్ లుక్ తోనే ఇప్పటివరకు సినిమాలు చేశారు. కేవలం “భరత్ అనే నేను” అనే సినిమాలో ఒక పాటలో మీసాలతో కనిపించారు. కానీ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గడ్డం పెంచుతున్నారు.
తాజాగా ఆయన న్యూయార్క్ నుంచి హైదరాబాద్ వచ్చారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ అమెరికాలో చదువుతున్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబు కెమెరాకి చిక్కిన విజువల్స్ ని బట్టి చూస్తే మహేష్ బాబు గడ్డం బాగానే పెరిగింది. కానీ సినిమా మాత్రం మొదలు కావడం లేదు.
రాజమౌళి – మహేష్ బాబు సినిమా నిజానికి ఈ నెలలోనే మొదలు కావాలి. కానీ, రాజమౌళి మరింత సమయం తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ చివర్లో కానీ జనవరిలో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతుందట. మొదలు పెట్టిన రెండేళ్లలో సినిమాని పూర్తి చెయ్యాలని రాజమౌళి భావిస్తున్నారు. 2026లో సినిమాని రిలీజ్ చెయ్యాలనేది ఆయన ప్లాన్. కానీ అది సాధ్యమవుతుందా అనేది చూడాలి.
మహేష్ బాబు పూర్తిగా ఈ సినిమాకే అంకితమయ్యారు. “గుంటూరు కారం” విడుదల అయిన వెంటనే రాజమౌళి సినిమా ప్రిపరేషన్ కి రెడీ అయిపోయారు.