హీరోయిన్లు-డేటింగ్స్ కామన్. కొంతమంది పైకి చెప్పుకుంటారు, మరికొంతమంది చెప్పరు, అంతే తేడా. అయితే హీరోయిన్ రెజీనా మాత్రం ఈ విషయంలో కొంచెం తేడా. తన డేటింగ్ పై ఆమె చాలా డిఫరెంట్ గా స్పందించింది.
జీవితంలో లెక్కలేనన్ని డేటింగ్స్ చేసిందంట ఈ హీరోయిన్. తనకు చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని, వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని చెప్పడం కష్టమని చెబుతోంది. అయితే అవన్నీ బ్రేకప్స్ అయ్యాయని కూడా శెలవిస్తోంది. తన ముక్కుసూటితనం వల్ల చాలా రిలేషన్ షిప్స్ చెడగొట్టుకున్నానని అంటోంది.
ఈ సందర్భంగా తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా బయటపెట్టింది. రెజీనా తల్లి క్రిస్టియన్. తండ్రి మరో మతానికి చెందిన వాడంట. అందుకే తన పేరు చివర కసాండ్రా అనే ట్యాగ్ లైన్ వచ్చిందని చెబుతోంది. అయితే చాలా ఏళ్ల కిందటే తన తల్లిదండ్రులిద్దరూ విడిపోయారని, అప్పట్నుంచి రిలేషన్ షిప్స్ పై తన మైండ్ సెట్ కూడా మారిపోయిందని చెబుతోంది.
తనకు కాబోయే వాడు బాధ్యతగా ఉంటే చాలని చెబుతోంది రెజీనా. మగాడు బాధ్యతగా ఉంటే, మిగతా క్వాలిటీస్ వాటంతట అవే పుట్టుకొస్తాయని అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ, ఉత్సవం అనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది.