ప్రతి హీరోయిన్ కు తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలనే అంశంపై క్లారిటీ ఉంటుంది. డేటింగ్ చేసే వ్యక్తిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ, పైకి మాత్రం వీళ్లు పెద్ద చిట్టా చెబుతుంటారు. హీరోయిన్ అదా శర్మ కూడా అదే చెబుతోంది.
“సంస్కారవంతమైన అబ్బాయిలు నాకిష్టం. అయితే కూసింతైనా హాస్య చతురత ఉండాల్సిందే. అలా లేకపోతే అతడితో పాటు నాక్కూడా సమస్యలు తప్పవు. బ్యాడ్ బాయ్స్ నాకు నచ్చరు. కోపంగా కనిపించే అబ్బాయిలు కూడా నాకు నచ్చరు. స్వీట్ బాయ్స్ నన్ను బాగా ఆకర్షిస్తారు.”
నిజజీవితంలో తను ఎలా ఉంటానో, తన జీవితంలోకి వచ్చేవాడు కూడా తనలానే ఉండాలని ఆశపడుతోంది అదా శర్మ. ఇన్ని విషయాలు చెప్పిన ఈ బ్యూటీ, పెళ్లిపై మాత్రం స్పందించలేదు. జరగాల్సింది జరగకమానదు అనే అర్థం వచ్చేలా స్పందించింది.
రీసెంట్ గా మీ-టూ వ్యవహారంపై రియాక్ట్ అయింది అదా శర్మ. తన దగ్గర ఎవ్వరూ పిచ్చి వేషాలు వేయలేరని, ఎందుకంటే తనకు కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వచ్చని తెలిపింది. తనకు ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని ప్రకటించింది.